![అత్యంత అవినీతి దేశాల లిస్ట్ విడుదల.. చైనా, పాక్తో పోల్చితే ఇండియా ఎన్నో ప్లేస్లో ఉందంటే..](https://static.v6velugu.com/uploads/2025/02/worlds-most-corrupt-country-list-released-india-and-bankrupt-pakistan-are-ranked-at_sq1KcgUFIQ.jpg)
ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాల లిస్ట్ ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (Transparency International) అనే సంస్థ విడుదల చేసింది. అవినీతిలో 2024లో ఏఏ దేశాలు ముందున్నాయి.. ఏ ఏ దేశాలు తక్కువ కరప్షన్ తో ఉన్నాయో ర్యాంకింగ్స్ ఇచ్చారు. మొత్తం 180 దేశాలకు సంబంధించిన లిస్టును 0-100 వరకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ర్యాంకులతో పాటు స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది.
ఎక్కువ స్కోర్ వచ్చిన దేశాలు తక్కువ కరప్షన్ ఉన్నట్లు.. అదే విధంగా తక్కువ ర్యాంక్ ఉన్న దేశాలలో ఎక్కువ కరప్షన్ ఉన్నట్లు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ లో కరప్షన్ పర్సప్షన్స్ ఇండెక్స్ (CPI) ఆధారంగా ఈ లిస్టు రిలీజ్ చేసింది.
CPI రిపోర్టు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అవినీతి అతిపెద్ద సమస్యగా మారింది. అయితే 2012 నుంచి 2024 వరకు 32 దేశాలు అవినీతిని తగ్గించుకున్నాయి. కరప్షన్ తగ్గించేందుకు 148 దేశాలు ఇంకా శ్రమించాల్సి ఉంది. ఇందులో రెండులో మూడొంతుల దేశాలు 50 స్కోర్ కు కిందనే ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది.
తక్కువ కరప్షన్ ఉన్న టాప్ 10 దేశాలు:
రిపోర్టు ప్రకారం డెన్మార్క్ దేశం 90 ర్యాంక్ తో టాప్ లో ఉంది. అంటే తక్కువ అవినీతి కలిగి ఉంది. ఆ తర్వాత ఫిన్ లాండ్ (88), సింగపూర్ (84), న్యూజీలాండ్ (83), లక్జెంబర్గ్ (81) తక్కువ అవినీతి కలిగిన దేశాల లిస్టులో టాప్ లో ఉన్నాయి.
ర్యాంక్ 1: డెన్మార్క్ (స్కోర్: 90)
ర్యాంక్ 2: ఫిన్ లాండ్ (స్కోర్: 88)
ర్యాంక్ 3: సింగపూర్ (స్కోర్:84)
ర్యాంక్ 4: న్యూజీలాండ్ (స్కోర్:83)
ర్యాంక్ 5: లక్జెంబర్గ్ (స్కోర్:81)
ర్యాంక్ 5: నార్వే (స్కోర్: 81)
ర్యాంక్ 5: స్విట్జర్లాండ్(స్కోర్:81)
ర్యాంక్ 8: స్వీడన్ (Score:80)
ర్యాంక్ 9: నెదర్లాండ్స్ (Score: 78)
ర్యాంక్ 10: Australia (Score: 77)
ఎక్కువ కరప్షన్ ఉన్న దేశాలు:
కరప్షన్ ఎక్కువ ఉన్న దేశాలలో కేవలం 8 పాయింట్ల స్కోర్ తో, లాస్ట్ ర్యాంక్ (180)తో సౌత్ సుడాన్ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత సోమాలియా (179), వెనుజులా (178), సిరియా (177) తదితర దేశాలు ఉన్నాయి.
ర్యాంక్ 170: సుడాన్ (స్కోర్: 15)
ర్యాంక్ 172: నికరాగువా(స్కోర్: 14)
ర్యాంక్173: గినియా(స్కోర్: 13)
ర్యాంక్173: లిబియా (స్కోర్: 13)
ర్యాంక్173: యెమెన్ (స్కోర్: 13)
ర్యాంక్177: సిరియా (స్కోర్: 12)
ర్యాంక్178: వెనుజులా(స్కోర్: 10)
ర్యాంక్179: సోమాలియా (స్కోర్: 9)
ర్యాంక్180: సౌత్ సుడాన్ (స్కోర్:8)
ఆర్థిక సమస్యలు, అంతర్గత యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న పాకిస్తాన్ 27 స్కోర్ తో 135వ స్థానంలో ఉంది. 2023తో పోల్చితే 2 స్థానాలు తగ్గింది. ఇక ఇండియా 2023 తో పోల్చితే 3 స్థానాలు తగ్గింది.
ఇండియా 38 పాయింట్లతో 96 ర్యాంక్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ తో పోల్చితే బెటర్ గా ఉన్నప్పటికీ చైనా కంటే మన దగ్గర అవినీతి ఎక్కువ ఉంది. చైనాకు 43 (పాయింట్లు) స్కోర్ తో 76వ ర్యాంక్ వచ్చింది.