ఒక బాటిల్ ఖరీదు 45 లక్షల రూపాయాలా! అందులో ఏమన్నా అమృతం తాగుతారా? అని ఆశ్చర్యపోతున్నారా! కానీ, ఇందులో తాగేది మంచి నీళ్లే. మరెందుకు అంత రేటు?
చాలామంది కూల్ డ్రింక్స్, విస్కీ, షాంపేన్ వంటి వాటికోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. కానీ, ఈ బాటిల్లో నీళ్లు తాగాలంటే మాత్రం అక్షరాల 45 లక్షల రూపాయలు పెట్టి కొనాల్సిందే. అయితే ఈ బాటిల్లో లీటర్‌కు కొంచెం తక్కువ నీళ్లు పడతాయి. ఇందులో తాగే నీళ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఆ నీళ్లను ‘‘ఆక్వాది క్రిస్టల్లో ట్రిబుటొ అ మొడిగ్లియని” అంటారు. ఈ వాటర్‌ని ఫ్రాన్స్, ఫిజిల నుంచి తెప్పించారట. అది సరే కానీ... ఈ బాటిల్‌కు ఇంతరేటు ఎందుకంటే అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి దీన్ని 24 క్యారెట్ల బంగారంతో తయారుచేశారు. దీన్ని వరల్డ్ ఫేమస్ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరనొ డిజైన్ చేయడం ఇంకో కారణం.