ప్రపంచంలో అత్యంత ఖరీదైన కుక్క..ధర రూ.50కోట్లు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కుక్క..ధర రూ.50కోట్లు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కుక్క..అరుదైన వోల్ఫ్ డాగ్..అమెరికాలో పుట్టి పెరిగి ఇండియాకు కొనుగోలు చేయబడిన అరుదైన డాగ్ బ్రీడ్. తొడేలు, కాకేషియన్ షెపర్డ్ ల సంకరజాతి అయిన ఈ ప్రత్యేకమైన కుక్క పేరు కాడాబాండ్ ఒకామి. దీనిని బెంగళూరుకు చెందిన ఓ కుక్కల ప్రేమికుడు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. దీని ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

బెంగళూరుకు చెందిన ఎస్ .సతీస్ అనే కుక్కల పెంపకందారుడు కాడాబాంబ్ ఒకామిని అమెరికానుంచి ఓ బ్రోకర్ ద్వారా కొనుగోలు చేశాడు. సతీష్ ఇతర దేశాలకు చెందిన కుక్కల సేకరణలో మంచి గుర్తింపు పొందాడు. దాదాపు 151 పైగా విభిన్న జాతులకు చెందిన కుక్కలను సేకరించాడు సతీష్. సేకరించిన విలువైన పెంపుడు కుక్కలను హై-ప్రొఫైల్ ఈవెంట్లలో ప్రదర్శిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. 

ALSO READ | ఇట్లయితే ఇండియాలో వ్యాపారం చేసుకోలేం..మోదీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎలాన్ మస్క్!

ఇక అత్యంత ఖరీదైన, అరుదైన కుక్క కాడాబాంబ్ ఒకామి గురించి చెప్పాలంటే.. దీని వయస్సు 8నెలలు.75 కిలోల బరువు, 30అంగుళాల పొడవు. తోడేలులా కనిపించే చాలా అరుదైన కుక్క జాతి. ప్రపంచంలో ఇంతకు ముందు ఎక్కడా ఇలాంటి కుక్క అమ్మబడలేదని దీని ఓనర్ సతీష్ చెబుతున్నాడు. ఒకామి..దాని మాతృ జాతులలో ఒకటైన కాకేసియన్ షెపర్డ్ నుంచి వచ్చిన బలం, తెలివితేటలు, రక్షణాత్మక ప్రవృత్తికి ప్రసిద్ధి చెందింది. కాకేసియన్ షెపర్డ్ జార్జియా, అర్మేనియా, అజర్‌బైజాన్, రష్యాలోని కొన్ని ప్రాంతాల వంటి చల్లని ప్రాంతాల్లో ఉంటాయి. ఈ కుక్కలను తరచుగా తోడేళ్ళ, దొంగలనుంచి పశువులను రక్షించడానికి ఉపయోగిస్తారు.

ఇక ఇంత ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన ఈ కుక్కతో సతీష్ ఏం చేస్తాడని అందరికి ఓ సందేహం కలిగి ఉండొచ్చు. ఈ కుక్కను ప్రదర్శిస్తూ బోలెడంత సంపాదిస్తున్నాడు.  కర్ణాటక అంతటా ఈవెంట్లు, సినిమా ప్రీమియర్‌లతో ప్రదర్శిస్తు్న్నాడు. ఈ కుక్కను ఒకసారి చూడాలన్నా, సెల్ఫీ దిగాలన్నా భారీ మొత్తం వసూలు చేస్తున్నాడు. 30 నిమిషాల ప్రదర్శనకు 2.45 లక్షలు , ఐదు గంటలకు 10లక్షలు వసూలు చేస్తున్నాడు. 

సతీష్ సేకరణలో మరో అరుదైన కుక్క జాతి కూడా ఉంది. చైనా నుంచి వచ్చిన ఎరుపు ,తెలుపు ఎలుగుబంటి జాతి అయిన క్విన్లింగ్ పాండాను పోలి ఉండే అరుదైన చౌ చౌ కూడా ఉంది. గతేడాది ఈ కుక్కను రూ.28 కోట్లు) పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా సతీష్ సంపాదన చూస్తే కుక్కల బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్థిల్లుతోందనడంలో సందేహం లేదు. లేకపోతే కోట్లు పెట్టి కొనుగోలు చేస్తాడా అని అంటున్నారు ఈ వార్త తెలిసినవారంతా.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Satish S (@satishcadaboms)