పెళ్లైన మహిళలందరూ తల్లి కావాలని కలలుగంటారు. అయితే తల్లి కాలేని పరిస్థితి వస్తే.. వారు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. పురుషుడి లోపం వల్ల గర్భం దాల్చకపోతే ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. అలా మనోవేదన పడుతున్న వారు.. ఆస్పత్రుల ద్వారా చికిత్స తీసుకొని పిల్లలకు జన్మనిద్దామంటే.. ఆర్థికంగా భరించలేరు. అటువంటి వారందిరికీ వీర్య దానం చేసి సంతోషపడుతున్నాడు ఓ 66 ఏళ్ల వ్యక్తి.
యూకేకు చెందిన క్లైవ్ జోన్స్ (66) గణిత ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. ఆయన తన 58వ ఏట నుంచి ఫేస్బుక్ ద్వారా వీర్య దానం చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా ఇప్పటివరకు 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో తొమ్మిది మంది మహిళలు గర్భంతో ఉన్నారు.
‘నేను బహుశా ప్రపంచంలో అత్యంత ఫలవంతమైన స్పెర్మ్ దాతగా ఉన్నాను. ప్రస్తుతం 129 మంది పిల్లలు పుట్టారు. మరో తొమ్మిది మంది గర్భవతులుగా ఉన్నారు. ఇలా నేను మరికొన్ని సంవత్సరాలు కొనసాగవచ్చు. ఎలాగైనా 150కి చేరుకోవాలనేది నా కోరిక. క్లినిక్‌లు, స్పెర్మ్ వ్యాపారులు ఉచితంగా వీర్యదానం చేయరు. యూకేలో వీర్యదానం చేయడానికి గరిష్ట వయసు 45 సంవత్సరాలు మాత్రమే. నా వయసు రిత్యా నేను వీర్యదానం చేస్తానంటే యూకే ప్రభుత్వం ఒప్పుకోదు. అందుకే నేను ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. చాలా సంతోషంగా ఉన్న తల్లులతో ఉన్న శిశువుల ఫోటోలను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది’అని జోన్స్ ఓ లైవ్లో చెప్పాడు.
For More News..