ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత

టోక్యో: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన టోమికో ఇతోకా (116) కన్నుమూశారు. జపాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇతోకా.. వృద్ధాప్య సమస్యలతో హ్యోగో ప్రిఫెక్చర్‌‌‌‌‌‌‌‌లోని కేర్ హోమ్‌‌‌‌‌‌‌‌లో  పోయిన నెల 29న మృతి చెందినట్లు అధికారులు శనివారం వెల్లడించారు.  

టోమికో ఇతోకా 1908, మే 23న ఒసాకోలో జన్మించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. గత ఏడాది స్పెయిన్ దేశస్థురాలైన బ్రన్యాస్ (117) మృతి చెందడంతో ఆమె తర్వాతి స్థానంలో ఉన్న ఇతోకా అత్యంత వృద్ధ మహిళగా నిలిచారు. గతేడాది మేలో ఆమె బర్త్ డే వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. 

ఇతోకాకు అరటిపండ్లు, కాల్పిస్ అనే డ్రింక్ చాలా ఇష్టం. స్కూల్ లో చదివేటప్పుడే వాలీబాల్ ఆడేవారు. సుమారు 3,067 మీటర్ల ఎత్తయిన మౌంట్ ఆన్‌‌‌‌‌‌‌‌టేక్‌‌‌‌‌‌‌‌ను ఆమె రెండు సార్లు అధిరోహించి రికార్డు సాధించారు. 20 ఏండ్లకే పెండ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.