ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీం గురించి మీకు తెలుసా? గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎత్తైన ఐస్‌క్రీమ్ కోన్ త్రోబాక్ ఫోటోను షేర్ చేసింది. ఈ త్రోబాక్ పోస్ట్‌లో నార్వేలోని క్రిస్టియన్‌శాండ్‌లో హెన్నిగ్-ఓల్సెన్, ట్రోండ్ ఎల్ వోయెన్ 3.08 మీటర్ల (10 అడుగులు మరియు 1.26 అంగుళాలు) ఎత్తైన ఐస్ క్రీమ్ కోన్‌ను తయారు చేశారు.
ఐస్ క్రీం అంటే చాలా మందికి ఇష్టం. క్యాండీలు, కోన్‌లు, కప్పులు ఐస్ క్రీం వంటి ఎన్నో వెరైటీల ఐస్‌క్రీంలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీం గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎత్తైన ఐస్‌క్రీమ్ కోన్ త్రోబాక్ ఫోటోను షేర్ చేసింది. ఈ త్రోబాక్ పోస్ట్‌లో నార్వేలోని క్రిస్టియన్‌శాండ్‌లో హెన్నిగ్-ఓల్సెన్, ట్రోండ్ ఎల్ వోయెన్ తయారు చేసిన 3.08 మీటర్లు అంటే, 10 అడుగుల 1.26 అంగుళాల ఎత్తైన ఐస్ క్రీమ్ కోన్ క్రేన్ లతో మోసుకెళ్లారు.
వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌లో దాదాపు 60 కిలోల చాక్లెట్ లైనింగ్, 1,080 లీటర్ల ఐస్ క్రీం, 40 కిలోల జామ్‌తో దీన్ని తయారు చేశారు. ఫ్యాక్టరీ ఫ్రీజర్‌లో కొలిచిన తర్వాత, దానిని హెలికాప్టర్‌లో తరలించారు. క్రిస్టియన్‌సండ్ హార్బర్‌లో జరిగిన టాల్ షిప్స్ రేస్ ఈవెంట్‌లో జెయింట్ కోన్ పంపిణీ చేయబడిందని గిన్నిస్ వెబ్‌సైట్ నివేదించింది
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన ఐస్ క్రీమ్ కోన్ తయారీకి సంబంధించిన పాత వీడియోను షేర్ చేసింది. నార్వేలోని హెన్నిగ్-ఓల్సెన్ అనే ఫ్యామిలీ ఐస్ క్రీం కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ కోన్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నివేదిక ప్రకారం, ఈ పెద్ద కోన్ దాదాపు ఒక టన్ను బరువు, 1,080 లీటర్ల ఐస్ క్రీంను పట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. . ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.