ఓ బాలుడు 14 ఏళ్లకే అత్యంత ఎత్తైన బాలుడిగా గిన్నిస్ బుక్‌లో రికార్డుకెక్కాడు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లెషన్ నగరానికి చెందిన రెన్ కీయూ అనే జూనియర్ హైస్కూల్ స్టూడెంట్ ఈ ఘనత సాధించాడు. ఏడు అడుగుల మూడు అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన బాలుడిగా నిలిచాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన వెబ్‌సైట్‌లో ఈ బాలుడిని చేర్చిన తర్వాత అతను ప్రపంచంలోనే ఎత్తైన బాలుడిగా నిర్ధారించబడ్డాడు. అక్టోబర్లో గిన్నిస్ బుక్ ప్రతినిధులు రెన్ ఎత్తును కొలిచి ఇప్పుడు ఫైనల్ నిర్ణయానికి వచ్చారు. ‘రెన్ కీయూ 221.03 సెం.మీ. ఎత్తును కలిగి ఉన్నాడు’ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఈ విద్యార్థి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులోనే ఈ రికార్డును చేజిక్కించుకున్నాడు.
‘నేను స్కూల్‌కి వెళ్లినప్పుడు నా వయసు పిల్లల కంటే నేను ఎత్తుగా ఉన్నానని గమనించాను. దాంతో నాకోసం స్కూళ్లో ప్రత్యేకమైప ఫర్నీచర్‌ను చేయించుకున్నాను. స్కూళ్లో అందరికంటే నేనే చాలా ఎత్తుగా ఉండేవాడిని. చాలామంది విద్యార్థులు నన్ను చాలా పెద్ద వయసు గలవాడిగా తప్పుగా భావించేవారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. అయితే నేను గిన్పిస్ బుక్‌లో రికార్డు సృష్టించి నా ఎత్తును నాకు సానుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని రెన్ తెలిపాడు.
గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన కెవిన్ బ్రాడ్‌ఫోర్డ్ పేరు మీద ఉంది. అతను రెన్ కంటే 5 సెం.మీ ఎత్తు తక్కువగా ఉండటంతో రెండో ప్లేస్‌లోకి దిగజారాడు.
For More News..