చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ విజృంభిస్తోంది. దాదాపు ఆరు నెలల సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కోటి దాటిపోయాయి. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటికే 5 లక్షల మందికి పైగా బలయ్యారు. ఆదివారం నాటి మొత్తం కరోనా బాధితుల సంఖ్య కోటి దాటాయని, అందులో సగానికి పైగా అమెరికా. యూరోప్‌లలోనే ఉన్నాయని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 54,83,527 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 41 లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరు రోజుల్లోనే పది లక్షల కరోనా కేసులు
ప్రపంచంలోనే యూరోప్ ఖండం కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమైంది. యూరప్ దేశాల్లో 26 లక్షల మందికి పైగా వైరస్ సోకగా.. 1,95 వేల మంది మరణించారు. ఇక ప్రపంచ దేశాల్లో అత్యధికంగా అమెరికాలో 25 లక్షల మంది కరోనా బారినపడ్డారు. అగ్రదేశంలో లక్ష 25 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ చెబుతోంది. గడిచిన ఆరు రోజుల్లోనే పది లక్షల కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది.
కరోనా కేసులు తీవ్రంగా ఉన్న 10 దేశాలు
దేశం మొత్తం కేసులు మరణాలు డిశ్చార్జ్ యాక్టివ్ కేసులు
1. అమెరికా 25,96,771 1,28,152 10,81,494 13,87,125
2. బ్రెజిల్ 13,,15,941 57,103 7,15,905 5,42,933
3. రష్యా 6,34,437 9,073 3,99,087 2,26,277
4. ఇండియా 5,30,993 16,124 3,11,001 2,03,868
5. యూకే 3,10,250 43,514 N/A N/A
6. స్పెయిన్ 2,95,549 28,341 N/A N/A
7. పెరూ 2,75,989 9,135 1,64,024 1,02,830
8. చిలీ 2,67,766 5,347 2,28,055 34,364
9. ఇటలీ 2,40,136 34,716 1,88,584 16,836
10. ఇరాన్ 2,22,669 10,508 1,83,310 28,851