బిచ్చగాడు..ఆ పదం ఉచ్చారణలోనే చులకన కనిపిస్తుంది కదా.. బిచ్చమెత్తుకోవడం అనే దీనస్థితి ఇంకోటి లేదు అనే మాటలు తరుచుగా వినిపిస్తుంటాయి. బిచ్చగాడు అన్నా.. బిచ్చమెత్తుకోవడం అన్నా సమాజంలో ఎంత హేయభావం ఉంటుందికదా.. బెగ్గింగ్ అనేది నీచమైన పని అని భావిస్తుంటారు చాలామంది.. ఏ దిక్కుమొక్కు లేక ఇతరులను పైఆధారపడి బతుకుతుంటారని చులకగా చూస్తుంటారు.. కానీ ముంబైకి చెందిన ఈ బిచ్చగాడు మాత్రం అలా కాదు.. బిచ్చగాడే కానీ కోటీశ్వరుడు..
సాధారణ మనుషుల్లాగే అతనికి బిల్డింగులు ఉన్నాయి.. ఆస్తులు ఉన్నాయి.. రోజుకు స్థిరమైన ఆదాయం పొందుతున్నాడు..ఒక్క ముక్కలో చెప్పాలంటే..ప్రపంచ రిచెస్ట్ బిచ్చగాడు ఇతడు.. అతని గురించి, అతని ఆస్తులు, జీవన శైలి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
భారత్ జైన్.. ముంబైలోని థానే సమీపంలోని రోడ్లు, సిగ్నల్ వద్ద తరుచుగా కనిపిస్తుంటాడు.. ఇతన వృత్తి బిచ్చమెత్తడం...దాదాపు నలభై ఏళ్లుగా ఈ ప్రాంతంలో బిచ్చమెత్తుకుంటూ అతను జీవించడమే కాకుండా తన కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చాడు. అతని కొడుకులను సెటిల్ చేశారు.. అంతేకాదు..అక్కడ వ్యాపారస్తు లకు వడ్డీలకు అప్పులు కూడా ఇస్తుంటాడు.. భారత్ జైన్ వీధుల్లో బిచ్చబెత్తుతూనే.. రోజుకు రూ. 2వేల నుంచి రూ.5వేల వరకు సంపాదిస్తాడట.. అంటే అతని సంవత్సరాదాయం రూ. లక్షా 50వేల దాకా ఉంటుందట.దాదాపు నలభై ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాడట.
ALSO READ | ఈ రాజ్యాంగ సవరణలు పూర్తయితే.. అతి త్వరలోనే జమిలి ఎన్నికలు
భారత్ జైన్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా అతని ఆస్తులు, బిల్డింగుల, ఇతని వ్యాపారాల గురించి చర్చలకు దారితీసింది. భారత్ జైన్ ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటూనే కోట్లు సంపాదించాడు. రెండు ఖరీదైన అపార్టెమెంట్లు కొన్నాడు.. అంతేకాదు భారత్ జైన్ కొడుకులను ప్రముఖ కాన్వెంట్ స్కూళ్లలో చదివించారు. కుటుంబాన్ని సెటిల్ చేశాడు.
భారత్ జైన్ ఆస్తి గురించే ఇప్పుడు అంతా చర్చ..దాదాపు ఇతని అస్థులు రూ.10.5 కోట్లు..ఇతని థానే ప్రాంతంలో రూ.1.5కోట్లు విలువైన ఖరీదైన రెండు బిల్డింగులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 1లక్షరూపాయల దాకా రెంట్లే వస్తాయట.. అంతేకాదు ఈ ప్రపంచ రిచెస్ట్ బెగ్గర్..తన కొడుకులతో రెండు స్టేషనరీ షాపులు కూడా నడిపిస్తున్నాడు.
భారత్ జైన్ బిచ్చమెత్తే వృత్తి నీకు చులకగా అనిపించడం లేదా..నీకుటుంబం అంతా ఓ పోజిషన్ కు వచ్చింది కదా..ఇప్పటికైనా మానేయొచ్చు కదా అంటే.. అతను చెప్పే సమాధానం ఒక్కటే..‘‘ నాకు ఎలాంటి చులకన భావం లేదు.. ఇదే వృత్తిని చనిపోయే వరకు కొనసాగిస్తాను అని..
పట్టుదల, తెలివైన ఇన్వెస్ట్ మెంట్, చేసే పని పట్ల గౌరవంవిధానం అద్భుతమైన విజయానికి ఎలా దారితీస్తాయో చెప్పడానికి భారత్ జైన్ కథ ఒక ఉదాహరణ..