ఇలా అయితే ఎలా తినేది.. తినే అన్నంలో పురుగులు

ఇలా అయితే ఎలా తినేది..   తినే అన్నంలో పురుగులు

కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ లోని మంజీర హాస్టల్ లో విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు దర్శనం ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు రోజు తినే ఆహారంలో ఇలా పురుగులు వస్తుంటే యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఆహారంలో పురుగులు రావడం పై హాస్టల్ వార్డెన్ విద్యార్థులు నిలదీయడంతో వారిపైనే విచక్షణ కోల్పోయి అరెస్టు విద్యార్థులను బెదిరించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.