
శివ్వంపేట, వెలుగు: జీరో బిల్లు రావడం లేదని శివ్వంపేట మండలం బిజిలీపూర్ గ్రామంలో శుక్రవారం కొందరు వినియోగదారులు ఆందోళన చేశారు. అర్హత ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పటికీ గ్రామంలో చాలామందికి జీరో బిల్లు రావడం లేదన్నారు. విద్యుత్సిబ్బంది బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో తమకు జీరో బిల్లు రావడంలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలన్నారు.