భద్రకాళీ అమ్మవారికి లక్ష మల్లెలతో అర్చన

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ భద్రకాళీ అమ్మవారికి బుధవారం లక్ష మల్లె పూలతో ప్రత్యేక అర్చన చేశారు. ఈ సందర్భంగా భద్రకాళి ఈవో శేషు భారతి మాట్లాడుతూ అధిదేవత విష్ణువు, పరమాత్మ చైతన్యం సత్వగుణ ప్రధానమైన వైష్ణవీ శక్తి విష్ణువు రూపంలో ఉండి భక్తులకు దర్శనం ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.