
పాలమూరు , వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామిని మంగళవారం మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ చల్లా వంశీచంద్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ఆలయాన్ని దర్శించుకోగా, ఆలయ అర్చకులు, నిర్వాహకులు వంశీచంద్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా ప్రజా పాలనలో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందాలన్నారు.