ఇక్కడి తాబేళ్లు సంథింగ్ స్పెషల్..పూజలందుకుంటాయి.

భారత దేశం హిందూ సంప్రదాయాలకు సంస్కృతికి పుట్టినిల్లు. ఇక్కడ ఎన్నో ఆలయాలు వెలిశాయి. నాటి రాజులు ఏలిన కాలం నుంచి నేటి ప్రభుత్వాల వరకు ఎన్నో దేవలయాలు నిర్మితమయ్యాయి. ఒక్కో దేవాలయానికి ఒక ఘనమైన చరిత్ర ఉంది...  ప్రతి  దేవాలయంలో జరిగే పూజలు.. ఉత్సవాలు.. సంబరాలు .. ఆ దేవాలయం చరిత్ర.. ఆ గ్రామ ఆచారల ప్రకారం జరుగుతుంటాయి.  ప్రతి దేవాలయానికి.. పూజలకు ఏదో కథ ఉంటుంది, అయితే అసోంలో కొన్ని దేవాలయాల్లో తాబేళ్లకు పూజలు చేస్తారు.  కెరీర్​ లో ఎదగాలని.. సత్​ సంతానం కలగాలని.. జీవితంలో త్వరగా సెటిల్​ అవ్వాలని ఇలా కోరుకుంటే తాబేళ్లకు పూజలు చేస్తుంటారు.  

ALSO READ | ఇండియాలో దెయ్యాలను  తరిమే గుడి ఎక్కడుందో.. తెలుసా..

అరుదైన తాబేళ్లను రక్షించేందుకు అస్సాం అధికారులు రంగంలోకి దిగారు. గుళ్లలోని కొలనుల్లో పూజలు అందుకుంటున్న తాబేళ్లను వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తం ఆరు రోజులపాటు ఈ డ్రైవ్ను నిర్వహించనున్నారు. తొలిదశలో సోనిట్ పూర్ జిల్లాలోని నాగోన్ శివస్థాన్ గుడిలోని అరవై ఏడు తాబేళ్లను బుర్చాపోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి తరలించారు. వాటిల్లో ఇండియన్ ఫ్లాఫె షెల్, పీకాక్ సాఫ్ట్ షెల్, ఇండియన్ టెంట్, బ్రౌన్- రూఫ్ట్, బ్లాక్ సాఫ్ట్ షెల్ జాతులకు చెందిన తాబేళ్లు ఉన్నాయి. టార్టల్ సర్వైవల్ అలియన్స్, వైల్డ్ లైఫ్ డివిజన్ సహకారంతో 'సేవ్ టార్టల్' ఆపరేషన్ని నిర్వహిస్తున్నాయి. 

ALSO READ | మహా అద్భుతం...  ఎంతో మహిమ గల క్షేత్రం... 108 శివలింగాలు.. 108 మారేడు మొక్కలు

అసోంలో  దాదాపు 18 ఆలయాల్లో తాబేళ్లకు పూజలు చేయడం ఆనవాయితీగా ఉంది. పిల్లలు పుట్టాలని, కెరీర్ లో త్వరగా సెటిల్ కావాలని వాటికి పూజలు చేస్తుంటారు జనాలు. ఇందుకోసం గుడి కొలనులో వాటికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు ఆలయ నిర్వాహకులు. అయితే కాంక్రీట్ కొలనులో తాబేళ్లు గుడ్లు పెట్టడం, అవి వాటిని పొదగడం సాధ్యమయ్యే పని కాదు. అంతేకాదు ప్రసాదం పేరుతో వాటికి పెట్టే తిండి వల్ల తాబేళ్ల జీవితకాలం తగ్గిపోతోంది. దీంతో తాబేళ్లు అంతరించే స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆలయ నిర్వాహకుల్ని, భక్తుల్ని ఒప్పించి వాటిని వైల్డ్ లైఫ్ శాంక్చురీకి తరలిస్తున్నారు.