ఆదిలాబాద్ ‘రిమ్స్’ లో రాజకీయం

ఖాళీలతో అందని సేవలు

రిక్రూట్ మెంట్ వద్దంటున్న డాక్టర్లు

డైరెక్టర్ పై సీనియర్ల ఒత్తిడి.. వంతపాడుతున్న లీడర్లు

ఇబ్బంది పడుతున్న రోగులు

రిమ్స్ ’ అంటేనే భయపడుతున్నకరోనా పేషెంట్లు 

ఆదిలాబాద్, వెలుగు: రిమ్స్​లో రాజకీయం తారాస్థా యికి చేరింది. కొందరు డాక్టర్లకు లీడర్లు వత్తాసు పలకడంతో ఖాళీలు భర్తీకి నోచుకోవడం లేదు. కొత్త డాక్టర్లు వస్తే ఎక్కడ తమ ప్రాధాన్యం తగ్గుతుందోనని కొందరు సీనియర్ డాక్టర్లు రిక్రూట్ మెంట్ అడ్డు తగులుతుండడంతో రోగులకు సరైన సేవలు అందడంలేదు. మొన్న హాస్పిటల్ నుంచి 10 మంది కరోనా పేషెంట్లు పారిపోవడం చర్చనీయాంశమైంది. సేవలు సరిగ్గా అందకనే వారు పరారైనట్లు తెలిసింది. రిమ్స్ డైరెక్టర్ , డాక్టర్ల మధ్య నెలకొన్న విభేదాలు రోగులకు ఇబ్బంది పాలుచేస్తున్నాయి. దవాఖాన ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయి.

అస్తవ్యస్తంగా అడ్మినిస్ట్రేషన్ ..

ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దదిక్కుగా నిలవాల్సిన రిమ్స్ ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గాడి తప్పింది. డైరెక్టర్ బలరాం నాయక్, డాక్టర్ల మధ్య సఖ్యత కొరవడింది. డైరెక్టర్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతంలో డాక్టర్లు వారం రోజుల పాటు ఆందోళనలు సైతం చేపట్టారు. అప్పటి కలెక్టర్ శ్రీదేవసేన జోక్యంతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినా ఆ తర్వాత మళ్లీ మొదలయ్యాయి . దీంతో హాస్పిటల్ సిబ్బందిపై డైరెక్టర్ ఆజమాయిషీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవకి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు.

ఇబ్బందుల్లో కరోనా పేషెంట్ లు

కరోనా రోగులకు వైద్యం అందడంలేదు. కింది స్థాయి సిబ్బందిని సైతం మందలించలేని పరిస్థితి డైరెక్టర్ కు లేదంటే రిమ్స్​లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇట్టే అర్థమవుతుంది. విధులను నిబంధనల మేరకు నిర్వహించాలానే డైరెక్టర్ ఆదేశాలను జీర్ణించుకోలేని డాక్టర్లు తమ ఉనికిని కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డైరెక్టర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. స్థా నిక అధికార పార్టీ పెద్దలు అండగా ఉండడంతో నే వారంతా ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా రోగులకు సరైన వైద్య సేవలకు అందడంలేదని ఆరోపణలొస్తున్నాయి. సరైన వలు అందకనే మొన్న కరోనా బాధితు లు హాస్పిటల్ నుంచి తప్పించుకుపోయినట్లు సమాచారం.

రిక్రూట్ మెంట్ చేయనీయడంలేదు…

రిమ్స్ లో రిక్రూట్ మెంట్ చేయవద్దంటూ పలువురు డాక్టర్లు వినతిపత్రం ఇచ్చారు. దీంతో హాస్పిటల్ లో వైద్యుల సంఖ్య పెరగడంలేదు. వైద్య సేవలు అందడంలేదు.- బలరామ్ నాయక్, రిమ్స్ డైరెక్టర్