భారత యువ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఓపెనర్.. ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవలపై అసహనం వ్యక్తం చేశాడు. సిబ్బంది తప్పిదం కారణంగా తాను విమానం కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించాడు. జీవితంలో తనకు ఎదురైన చెత్త అనుభవం ఇదేనని ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై విరుచుకుపడ్డాడు.
"ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగోతో నాకు చెత్త అనుభవం ఎదురైంది. సిబ్బంది ప్రవర్తన, ముఖ్యంగా కౌంటర్ మేనేజర్ శ్రీమతి సుస్మితా మిట్టల్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. నేను సరైన సమయానికి కౌంటర్ వద్దకు చేరుకున్నాను, కానీ వారు నన్ను అనవసరంగా మరొక కౌంటర్‌కు దారి మళ్లించారు. ఆ తరువాత చెక్-ఇన్ మూసివేయబడింది. వారి తప్పిదం కారణంగా నేను ఫ్లైట్ కోల్పోయాను. నా షెడ్యూల్ నాశనం చేశారు. పండగ ఆనందం లేకుండా పోయింది.." అని అభిషేక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకున్నారు.
ఇప్పటివరకు టీమిండియా తరపున 12 టీ20లు ఆడిన 171.18 స్ట్రైక్ రేట్, 23.27 సగటుతో 256 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కీలకం కానున్నాడు.
ALSO READ | PSL 2025: పాకిస్థాన్ సూపర్ లీగ్: కరాచీ కింగ్స్‌కు వార్నర్,విలియంసన్