నిద్ర పోయే ముందు వీటిని తినొద్దు.. తాగొద్దు..

నిద్ర పోయే ముందు వీటిని తినొద్దు.. తాగొద్దు..

సరైన నిద్ర.. మంచి నిద్ర ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతుంది. ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. నిద్ర సరిగా లేకపోయినా.. ఆ తర్వాత రోజు అంతా చిరాకు.. చికాకు తప్పదు. మంచి నిద్ర కావాలంటే.. మంచిగా నిద్ర పోవాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి.. మరి నిద్రపోయే ముందు ఈ ఆహారాన్ని, ఈ లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవద్దు అంటున్నారు డాక్టర్లు. అవేంటో తెలుసుకుందామా..

  • నిద్రపోయే ముందు అంటే రాత్రి 9 గంటల తర్వాత స్పైసీ ఫుడ్ అస్సలు తినొద్దు. అధిక మసాలాలు ఉన్న ఫ్రైడ్ రైస్, స్పైసీ చికెన్, మటన్ లాంటివి తినకూడదు.
  • అధికంగా ఉండే చీజ్.. వెన్న పదార్థాలు తీసుకోకూడదు.
  • చాక్లెట్స్.. చాక్లెట్ ఫేవర్ ఉంటే ఆహార పదార్థాలు, ఐటమ్స్ తినకూడదు.
  • నిద్రపోయే ముందు వేడి వేడి కాఫీ తాగొద్దు.
  • నిద్రకు ముందు మద్యం తాగకూడదు అంట.. చాలా చాలా లైట్ గా తీసుకోవాలంట. అధిక మోతాదులో ఆల్కాహాల్ తీసుకుంటే సరైన నిద్ర ఉండదు అంట.
  • అధిక కొవ్వు ఉండే పదార్థాలను సైతం రాత్రిపూట నిద్రకు ముందు తినటం మంచిది కాదు.. ( ఎగ్జాంపుల్.. వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలు, నూనెలో బాగా వేయించిన ఫ్రైలు, బిస్కెట్స్, కేకులు, డ్రై ఫ్రూట్స్ వంటి అధిక కొవ్వు ఉండే వాటికి దూరంగా ఉండాలి)