రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 13వ తేదీ శనివారం రోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన రెండో బౌలర్ గా చాహల్ నిలిచాడు. ఇప్పటివరకు అతను 150 మ్యాచ్ లలో చాహల్ 201 సిక్సర్లు ఇచ్చాడు. ఈ లిస్టులో చాహల్ కంటే ముందు పీయూష్ చావ్లా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతను 184 ఇన్ని్ంగ్స్ లలో 211 సిక్సర్లు ఇచ్చాడు. ఇక ఈ లిస్టులో రవీంద్ర జడేజా (198), రవిచంద్రన్ అశ్విన్ (189), అమిత్ మిశ్రా (182) తరువాతి స్థానాల్లో ఉన్నారు.
- పీయూష్ చావ్లా – 184 ఇన్నింగ్స్‌ల్లో 211 సిక్సర్లు
- యుజ్వేంద్ర చాహల్ – 150 ఇన్నింగ్స్‌ల్లో 201 సిక్సర్లు
- రవీంద్ర జడేజా – 202 ఇన్నింగ్స్‌ల్లో 198 సిక్సర్లు
- రవిచంద్రన్ అశ్విన్ – 199 ఇన్నింగ్స్‌ల్లో 189 సిక్సర్లు
- అమిత్ మిశ్రా – 161 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్సర్లు
పంజాబ్‌పై చాహల్ ఒక వికెట్ తీసి మళ్లీ పర్పుల్ క్యాప్‌ని కైవసం చేసుకున్నాడు. ఇంతకు ముందు బుమ్రా ఈ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన చాహల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు . ఈ సీజన్‌లో అతడి ఎకానమీ 7.40 కాగా.. సగటు 14.81గా ఉంది. ఇప్పటి వరకు 3305 బంతులు వేసిన చాహల్ మొత్తం 198 వికెట్లు తీశాడు. మరో రెండు వికెట్లు తీస్తే ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్‌పై రాజస్థాన్ గెలిచింది. 148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఛేదనలో చెమటోడ్చింది. ఆఖర్లో హెట్మెయిర్ 10 బంతుల్లో 27 పరుగులతో మెరుపులు మెరిపించడంతో గట్టెక్కింది. ఆర్ఆర్ బ్యాటర్లలో యశస్వి(39) రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో రబాడ, కరన్ చెరో 2 వికెట్లు, అర్షదీప్, లివింగ్‌స్టన్, హర్షల్ తలో వికెట్ తీశారు. రాజస్థాన్‌కు ఇది ఐదో విజయం కావడం విశేషం.