ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ మ్యాక్స్ వెల్ కు అసలు కలిసి రాలేదు. ప్రపంచంలోనే విధ్వంసకర బ్యాటర్లలో ఒకడైనా మ్యాక్ వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ముంచేశాడు. ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా లేకపోగా ప్రతి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యాడు. మిడిల్ ఆర్డర్ లో కీలకంగా మారతాడనుకుంటే వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. సీజన్ మొత్తం దారుణంగా విఫలమైన ఈ ఆసీస్ వీరుడు ప్లే ఆఫ్ లో డకౌట్ కావడం ఆర్సీబీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏ మాత్రం బాధ్యత లేకుండా తొలి బంతికే భారీ షాట్ కు ప్రయత్నించి అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అప్పటికే జట్టు మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడినా తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్య షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో మ్యాక్స్ వెల్ వచ్చే సీజన్ లో బెంగళూరు తరపున ఆడటం అనుమానంగా మారింది. 2025 ఐపీఎల్ లో మెగా ఆక్షన్ జరగబోతుంది. దీని ప్రకారం ముగ్గురు లేదా నలుగురు ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీ రెటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు రెటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టులో మ్యాక్ వెల్ ఉండడనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మ్యాక్ వెల్ వేలంలోకి వస్తాడు.
ఈ సీజన్ లో మొత్తం 9 ఇన్నింగ్స్ ల్లో 52 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వీటిలో నాలుగు డకౌట్స్ ఉన్నాయి. స్టార్ ప్లేయర్ అని వరుస అవకాశాలు ఇస్తుంటే ఒక్క మ్యాచ్ లో కూడా ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాటింగ్ ఇలా వచ్చి అలా వెళ్ళాడు. పట్టుమని పది బంతులు ఆడకుండా కనీసం రెండంకెల స్కోర్ చేయకుండానే పెవిలియన్ కు చేరుతున్నాడు. రూ. 11 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న ఆర్సీబీ నిరాశ తప్పలేదు. దీంతో ఈ విధ్వంసకర వీరుడు ఐపీఎల్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.
A disastrous season for Glenn Maxwell with the bat in IPL 2024. pic.twitter.com/H3IaUhvsyw
— CricTracker (@Cricketracker) May 22, 2024