వాషింగ్ మెషీన్లు అంటే పెద్దగా ఉండేవి.. ఓ కుటుంబం బట్టలు మొత్తం ఉతకడానికి కొనుగోలు చేస్తుంటాం.. పైగా కొంచెం కరెంట్ వినియోగం సమస్యలు.. అయినా ప్రస్తుత బిజీ లైఫ్ లో వాషింగ్ మిషిన్ లేని కుటుంబం అంటూ లేదు.. ఇంట్లో వరకు అయితే ఓకే.. మరి హాస్టళ్లలో ఉండే వారి బట్టల లాండ్రీ విషయంలో .. చిన్న చిన్న అపార్టుమెంట్ల విషయంలో ఈ పెద్ద వాషింగ్ మిషన్లు వినియోగం సాధ్యమవవుతుందా.. అలాంటి వారికి కోసం ఇప్పుడు మినీ పోర్డబుల్ వాషింగ్ మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. రకరకాల కంపెనీల ఈ మినీ పోర్డబుల్ వాషింగ్ మిషన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.
కేవలం 15 నిమిషాల్లో మీ బట్టలకు పట్టి ఉన్న బ్యాక్టీరియాతో సహా మురికిని వదలగొడతాయి. ఇందుల్లో పిల్లల సాక్స్ లు, పెద్దల బట్టలు, పీడింగ్ బాటిల్స్, పండ్లు, కూరగాయలు కూడా క్లీన్ చేసుకోవచ్చట. పెంపుడు జంతువుల వస్తువులనూ శుభ్రపరుచుకోవచ్చట. ఈ డివైజ్ లో స్పిన్ అయ్యే మిని బకెట్ ఉంటుంది. అది గిర్రున తిరుగుతూ తడిని పోగొడుతుందట.. దీంతో ఇందులో క్లీన్ చేసిన బట్టలు వేగంగా శుభ్రమవడమే కాకుండా త్వరగా ఆరిపోతాయి.
ఈ మినీ పోర్డబుల్ వాషింగ్ మెషిన్లు వెయ్యి రూపాయల నుంచి లభిస్తున్నాయి. ఇందులో మిని(MINI) పోర్డబుల్ వాషింగ్ మెషీన్ ధర రూ. 4009. , NIKHEEL Semi Auto Matic folding ధర రూ. 2,999 ఉండగా అమెజాన్ లో 1499కి లభిస్తుంది.