డబ్ల్యూపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన పెర్రీ.. టోర్నీ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. మొత్తంగా 4 ఓవర్లు వేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ 15 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. డబ్ల్యూపీఎల్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో ఒక బౌలర్ 6 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి.
డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు
- ఎలీస్ పెర్రీ: 6/15 (ఆర్‌సీబీ)
- మరిజన్నె కాప్: 5/15 (ఢిల్లీ)
- ఆశా శోభన: 5/22 (ఆర్‌సీబీ)
- తారా నోరిస్: 5/29 (ఢిల్లీ)
- కిమ్ గార్త్: 5/36 (గుజరాత్)
Ellyse Perry Show at Delhi's Arun Jaitley Stadium tonight#CricketTwitter #WPL2024 #MIvRCB pic.twitter.com/vfE8nRJYgb
— Female Cricket (@imfemalecricket) March 12, 2024