
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నేడు(మార్చి 11) కీలక మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఇప్పటివరకూ 7 మ్యాచ్ల్లో మూడింట గెలిచిన యూపీ వారియర్స్కు ఇది ఆఖరి అవకాశం. గెలిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వనుంది.
యూపీ వారియర్స్కు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో.. గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో వారియర్స్ ఫస్ట్ బౌలింగ్ చేయనుంది.
తుది జట్లు:
యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్/వికెట్ కీపర్), కిరణ్ నవ్గిరే, చమరి ఆటపట్టు, గ్రేస్ హారిస్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, సైమా ఠాకోర్, రాజేశ్వరి గైక్వాడ్, అంజలి శర్వాణి.
గుజరాత్ జెయింట్స్: లారా వోల్వార్డ్ట్, బెత్ మూనీ(కెప్టెన్/వికెట్ కీపర్), ఫోబ్ లిచ్ఫీల్డ్, దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్, భారతి ఫుల్మాలి, క్యాథరిన్ బ్రైస్, మన్నత్ కశ్యప్, తనూజా కన్వర్, మేఘనా సింగ్, షబ్నమ్ షకీల్.