డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయంతో ప్రారంభించింది. శనివారం(ఫిబ్రవరి 24) యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ మహిళా జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మందాన సేన 157 పరుగులు చేయగా.. ఛేదనలో యూపీ వారియర్జ్ విజయానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయారు. తొలి మ్యాచ్‌లానే రెండోది ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ రాణించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగారు. రీచా ఘోష్(62), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన(53)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. స్మృతి మంధాన(13), సోఫె డెవిన్(1), ఎలీసా పెర్రీ(8), విఫలమయ్యారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ 2 వికెట్లు తీసింది
అనంతరం 158 పరుగుల ఛేదనలో యూపీ వారియర్జ్ విజయానికి 2 పరుగుల దూరంలో నిలిచింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. వారియర్జ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు అవసరం కాగా, ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు. బెంగళూరు బౌలర్లలో శోభన ఆశా 5 వికెట్లు పడగొట్టి యూపీ ఓటమిని శాసించింది.
ASHA SOBHANA, RCB'S STAR SPINNER 🤩
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2024
Three wickets in her final over to turn the contest around! https://t.co/trHPTqUaT7 #RCBvUPW #WPL2024 pic.twitter.com/9X2eT7nrwr
RCB's winning moment ❤️🔥#CricketTwitter #WPL2024 #RCBvUPW pic.twitter.com/WxQ5Qk430F
— Female Cricket (@imfemalecricket) February 24, 2024