WPL Final 2024: ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2024 విన్నర్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధాన -31, సోఫీ డివైన్ -32, ఎలిప్సే పెర్రీ -29, రిచా ఘోష్ -11 పరుగులతో అద్భుతమైన బ్యాటింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విజయతీరాలకు చేర్చారు. మొదటినుంచి దూకుడుగా ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పరుగుల వేటలో చతికిల పడింది. నిర్ణీత 20 ఓటర్లలో 113పరుగులు చేసి ఆలౌటైంది. షఫాలీ శర్మ 44, మెగ్ లానింగ్ (23), రాధా యాదవ్ (12) అరుంధతి రెడ్డి (10) పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ బోర్డును కొంతవరకు రన్ చేశారు. ప్రారంభంలో దూకుడుగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్.. 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 65 పరుగులు చేశారు..స్కోర్ బోర్డు పరుగులు పెడుతుందనుకుంటున్న సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ సోఫి మాలినక్స్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి షాకిచ్చింది.. అక్కడి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ బోర్డు మందగించడంతోపాటు వికెట్లు కూడా వెంట వెంటనే పడిపోయాయి. 14 ఓవర్లో ఆశా శోభన ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతి తక్కువ స్కోరుకు కారణమయ్యింది.
ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: మెగ్ లానింగ్-23, షఫాలీ వర్మ-44, అలిస్ క్యాప్సే-0, జెమిమా రోడ్రిగ్స్-0, మారిజాన్కాప్-8, జెస్ జోనాస్సెన్-3 , రాధా యాదవ్-12, అరుంధతి రెడ్డి-10, శిఖాపాండే-5, మిన్ను మణి-5.