WPL 2024: బౌలింగ్ ఎంచుకున్న వారియర్జ్.. ఆర్‌సీబీ జట్టులో నలుగురు హిట్టర్లు

WPL 2024: బౌలింగ్ ఎంచుకున్న వారియర్జ్.. ఆర్‌సీబీ జట్టులో నలుగురు హిట్టర్లు

డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్ ఎంత మజాను పంచిందో అందరికి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌‌పై.. ముంబై ఇండియన్స్‌ ఆఖరి బంతికి గట్టెక్కింది. విజయానికి చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా, ముంబై బ్యాటర్ సజనా సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌కు వచ్చేశాం. శనివారం(ఫిబ్రవరి 24)  బెంగుళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్జ్ తపడుతున్నాయి. టాస్ గెలిచిన వారియర్జ్ సారథి అలిస్సా హీలీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆర్‌సీబీ బ్యాటింగ్ చేయనుంది. 

యూపీ వారియర్జ్ బౌలింగ్ పరంగా బలంగా కనిపిస్తుంటే, రాయల్ ఛాలెంజర్స్ బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ రూపంలో ఏకంగా నలుగురు హిట్టర్లు ఉన్నారు.

తుది జట్లు

యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్, వికెట్ కీపర్), వృందా దినేష్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, రాజేశ్వరి గయక్వాడ్, పూనమ్ ఖేమ్నార్, సైమా థాకర్.
జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, సిమ్రాన్, శోభనా సింగ్, రేణుకా ఠాకూర్.