
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) భాగంగా నేడు(మార్చి 4) యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ సారథి అలిస్సా హీలి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆర్‌సీబీ మహిళలు బ్యాటింగ్ చేయనున్నారు.
బెంగళూరు వేదికగా జరగబోయే ఆఖరి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఇదే. రేపటి (మార్చి 05) నుంచి డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దీంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలవడం కీలకం.
తుది జట్లు:
యూపీ వారియర్స్: అలిస్సా హీలీ(కెప్టెన్, వికెట్ కీపర్), కిరణ్ నవ్‌గిరే, చమరి ఆటపట్టు, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అంజలి శర్వాని.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్(వికెట్ కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, ఏక్తా బిష్త్, సిమ్రాన్ బహదూర్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.
TOSS Update 🪙
— CRICGLOBE (@thecricglobe) March 4, 2024
UP Warriorz women have won the. Toss and opted to bowl first #RCBvUPW pic.twitter.com/fz86kD5F20