డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. గంటల వ్యవధిలోనే ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2025) టోర్నీ నుండి తప్పుకున్నారు. ఇంగ్లిష్ ఆల్ రౌండర్ కేట్ క్రాస్, న్యూజిలాండ్ వెటరన్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్ వ్యక్తిగత కారణాల రీత్యా టోర్నీ నుండి వైదొలొగుతున్నట్లు ఫ్రాంచైజీకి తెలియజేశారు.
దాంతో, వీరిద్దరి స్థానంలో ఆర్‌సీబీ యాజమాన్యం.. ఆస్ట్రేలియా ద్వయం హీథర్ గ్రహమ్, కిమ్ గార్త్‌లను భర్తీ చేసింది. గ్రహమ్ రెండేళ్ల క్రితం భారత్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించింది. మరోవైపు, గార్త్ ఇటీవల కాలంలో భీకర ఫామ్ కనబరుస్తోంది. వీరిద్దరు రూ. 30 లక్షల కనీస ధరకు ఆర్‌సీబీలో చేరారు.
సోఫీ మోలినిక్స్..
అంతకుముందు గాయం కారణంగా సోఫీ మోలినిక్స్ దూరమవ్వడం ఆర్‌సీబీకి మరో దెబ్బ. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలదు. పవర్ ప్లే సహా ఆఖరి ఓవర్లలోనూ పరుగులు రాకుండా కట్టడి చేయగల సమర్ధురాలు. మోలినెక్స్ స్థానంలో ఆర్‌సీబీ యాజమాన్యం చార్లీ డీన్‌ను ఎంపిక చేసింది.
ALSO READ | Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల బుకింగ్ ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండి
డబ్ల్యూపీఎల్ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
పాల్గొనే జట్లు
- గుజరాత్ జెయింట్స్
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- ముంబై ఇండియన్స్
- ఢిల్లీ క్యాపిటల్స్
- యూపీ వారియర్జ్