![WPL 2025: మహిళల పోరుకు వేళాయె.. 22 రోజులు, 22 మ్యాచ్‌లు.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్](https://static.v6velugu.com/uploads/2025/02/wpl-2025-womens-premier-league-2025-schedule-and-live-streaming-details_b3uNB4SAIW.jpg)
మగాళ్ల క్రికెట్ మ్యాచ్‌లు చూసి బోర్ కొట్టేసిందా..! ఇంకెందుకు ఆలస్యం. మహిళల పోరుకు వేళయ్యింది. మరికొన్ని గంటల్లో మహిళల ప్రీమియర్ లీగ్(WPL)2025 తెరలేవనుంది. గురువారం(ఫిబ్రవరి 14) తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. వడోదర వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
టోర్నీఫార్మాట్..
మొత్తం ఐదు జట్లు తలపడుతున్న ఈ టోర్నీ డబుల్ రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతోంది. అంటే, లీగ్ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశ ముగిసేసమయానికి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్ ఆడనుండగా.. రెండు, మూడో స్థానంలో నిలిచిన జల్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో తలపడతుంది.
Also Read :- గెలిచే సత్తా మాకే ఉంది.. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మాదే
మొత్తం నాలుగు నగరాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కోటాంబి స్టేడియం(వడోదర), చిన్నస్వామి స్టేడియం(బెంగళూరు), ఎకానా స్టేడియం(లక్నో), బ్రాబౌర్న్ స్టేడియం(ముంబై)ల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లకు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
లైవ్.. ఫ్రీగా ఇలా చూడండి
డబ్ల్యూపీఎల్ 2025 మ్యాచ్ లు స్పోర్ట్స్ 18 ఛానెల్ పాటు జియోసినిమాలో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. మొత్తం 8 భాషాల్లో కామెంట్రీ అందుబాటులో ఉండనుంది. జియోసినిమాలో మ్యాచ్‌లు ఉచితంగా వీక్షించవచ్చు. అదే స్పోర్ట్స్ 18 ఛానెల్ కావాలంటే సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పాల్గొనే 5 జట్లు ఇవే..
- యూపీ వారియర్జ్: దీప్తి శర్మ (కెప్టెన్)
- ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్)
- ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్)
- గుజరాత్ జెయింట్స్: ఆష్లీగ్ గార్డనర్ (కెప్టెన్)
డబ్ల్యూపీఎల్ 2025 షెడ్యూల్
- ఫిబ్రవరి 14: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- ఫిబ్రవరి 15: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
- ఫిబ్రవరి 16: గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్జ్
- ఫిబ్రవరి 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- ఫిబ్రవరి 18: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్
- ఫిబ్రవరి 19: యూపీ వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్
- ఫిబ్రవరి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్
- ఫిబ్రవరి 22: ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్జ్
- ఫిబ్రవరి 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్జ్
- ఫిబ్రవరి 25: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్
- ఫిబ్రవరి 26: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్జ్
- ఫిబ్రవరి 27: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్
- ఫిబ్రవరి 28: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్
- మార్చి 1: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్
- మార్చి 3: యూపీ వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్
- మార్చి 6: యూపీ వారియర్జ్ vs ముంబై ఇండియన్స్
- మార్చి 7: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
- మార్చి 8: యూపీ వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- మార్చి 10: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్
- మార్చి 11: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- మార్చి 13: ఎలిమినేటర్ మ్యాచ్ (బ్రాబోర్న్ స్టేడియం, ముంబై)
- మార్చి 15: ఫైనల్ (బ్రాబోర్న్ స్టేడియం, ముంబై)