WPL: ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌పై కన్నేసిన ముంబై ఇండియన్స్‌..‌ యూపీ వారియర్స్‌తో అమీతుమీకి సిద్ధం

WPL: ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌పై కన్నేసిన ముంబై ఇండియన్స్‌..‌ యూపీ వారియర్స్‌తో అమీతుమీకి సిద్ధం

లక్నో: డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌పై కన్నేసిన ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌.. యూపీ వారియర్స్‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు వరుస పరాజయాలతో డీలా పడిన యూపీ (4 పాయింట్లు) నాకౌట్‌‌‌‌‌‌‌‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కచ్చితంగా గెలవాలి. ఈ నేపథ్యంలో సర్వశక్తులు ఒడ్డి ముంబైని కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇది జరగాలంటే కెప్టెన్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మతో గ్రేస్‌‌‌‌‌‌‌‌ హారిస్‌‌‌‌‌‌‌‌, కిరణ్‌‌‌‌‌‌‌‌ నవ్‌‌‌‌‌‌‌‌గిరే, జార్జియా వోల్‌‌‌‌‌‌‌‌,  వ్రిందా దినేశ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటాలి. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో శ్వేత షెరావత్‌‌‌‌‌‌‌‌, ఉమా ఛెత్రితో పాటు చినెల్లీ హెన్రీ కీలకం కానుంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఎలెక్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌కు గౌర్‌‌‌‌‌‌‌‌ సుల్తానా, క్రాంతి గౌడ్‌‌‌‌‌‌‌‌ అండగా నిలవాల్సి ఉంటుంది. ఇక ముంబై  (6)కూడా గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. యాస్తిక భాటియా, హేలీ మాథ్యూస్‌‌‌‌‌‌‌‌తో పాటు సివర్‌‌‌‌‌‌‌‌ బ్రంట్‌‌‌‌‌‌‌‌, హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌, అమెలియా కెర్‌‌‌‌‌‌‌‌ చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు.