
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ ఒలంపిక్స్ ఫైనల్ లో అనర్హత వేటు పడింది. ఈ క్రమంలోనే వినేష్ స్పృహ కోల్పోయారు. డీహైడ్రేషన్ రెజ్లర్ కుప్పకూలినట్లు సమాచారం. అనర్హత వేటు పడిన కొద్ది సేపటికే ఫొగాట్ఆస్పత్రి పాలు కావడం చర్చనీయాంశం అయ్యింది.
మరోవైపు రెజ్లర్ పై అనర్హత వేటు పడటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులను షాక్కు గురిచేస్తుంది. 100 గ్రాముల బరువు ఎక్కువైనందుకే అనర్హతగా ప్రకటిస్తారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో 2024 ఒలంపిక్స్ హాట్ టాపిక్ గా మారాయి.
దీనిపై భారత ప్రధాని మోదీ సైతం స్పందించారు.. వినేశ్ ఫొగాట్.. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్.. మీరు భారతదేశానికే గర్వకారణం. భారతీయులు అందరికీ స్ఫూర్తి. ఈ రోజు మీకు ఎదురుదెబ్బ తగలొచ్చు.. మీరు అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోగలం.. ఇదే సమయంలో మీలోని పోరాట స్ఫూర్తి.. సవాళ్లను ఎదురొడ్డి మీ స్వభావంతో.. మీరు బలంగా ఇండియాకు తిరిగి రండి. మేమంతా మీ కోసం మేం ఎదురుచూస్తూ ఉంటాం అని ఓదార్చారు ప్రధాని మోదీ..