రెజ్లర్ వినేష్ ఫొగట్ ఘన విజయం : ఒలంపిక్స్‌లో ఓడినా.. MLAగా గెలుపు

రెజ్లర్ వినేష్ ఫొగట్ ఘన విజయం : ఒలంపిక్స్‌లో ఓడినా.. MLAగా గెలుపు

రెజ్లర్ వినేష్ ఫొగట్ అంటే తెలియని వారే ఎవరు ఉండరు. వినేష్ ఫొగట్ ఒలంపిక్స్ లో డిస్ క్వాలిఫై అయినా.. అందరి హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు హర్యానా ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యేగా నెగ్గింది. కేవలం 100గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా వినేష్ ఫొగట్ పారిస్ ఒలంపిక్స్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో బంగారు పతాకం చేజారిపోయింది. ఇప్పుడు ఆమె హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో వినేష్ 6 వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది. వినేష్ ఫొగట్ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళా రెజర్లకు మద్దతుగా నిలిచి.. వారి కోసం న్యాయ పోరాటం చేసింది. 

ఈమె పోటీ చేసిన జులనా నియోజకవర్గం నుంచి ఆప్‌ అభ్యర్థిగా కవితా దలాల్, జెజెపికి చెందిన అమర్జీత్ ధండా, ఐఎన్‌ఎల్‌డి నుంచి సురేందర్ లాథర్, బిజెపి యోగేష్ బైరాగి బరిలో ఉన్నారు. అక్టోబరు 5న జరిగిన హర్యానా అసెంబ్లీలోని 89 ఇతర స్థానాలతో పాటు జులనా అసెంబ్లీ స్థానానికి ఓటింగ్ జరిగింది. తొలి ట్రెండ్‌లో కాంగ్రెస్ 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తర్వాత నాల్గవ రౌండ్ కౌంటింగ్ కు వచ్చే సరికి బిజెపి కాంగ్రెస్‌ను అధిగమించింది. ప్రస్తుతం మెజారిటీ మార్కు సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

ALSO READ | Live Updates: జమ్మూకాశ్మీర్, హర్యానా ఓట్ల కౌంటింగ్