కుభీర్, వెలుగు : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కుభీర్ మండలంలోని రామ్‌నాయక్ తండాలో శివ శంకర జాతర నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం జరిగిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. మండలంలోని పలు గ్రామాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా మల్లయోధులు తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కీనాల గ్రామానికి చెందిన సంజీవ్ పాటిల్ విజేతగా నిలిచి రూ.7 వేల నగదు బహుమతి అందుకున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.