
కుభీర్,వెలుగు: మండల కేంద్రమైన కుభీరులో ఉగాదిది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీ విఠలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి మల్లయోధులు భారీగా తరలివచ్చారు. కుస్తీ పోటీల్లో గెలిచిన మల్ల యోధులకు ఆలయ కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటాజీ, కందూర్ కనకయ్య,బి. విఠల్, సాయినాథ్, బంక బాబు, ఎన్నిల అనిల్, పి. లక్ష్మణ్ పాల్గొన్నారు.