యాద్గార్ పూర్ లో కుస్తీ పోటీలు

యాద్గార్ పూర్ లో కుస్తీ పోటీలు

కోటగిరి,వెలుగు: కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామంలో ఉగాది పర్వదినం  సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా ప్రతియేటా గౌడ సంఘం సహకారంతో గ్రామంలో కుస్తీ పోటీలు  నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. మహారాష్ట్రతో పాటు చుట్టుపక్క గ్రామాల నుంచి క్రీడాకారులు  పాల్గొని ప్రతిభ కనబర్చారు.

 కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దాదు , ఏఈఓ సందీప్, కారోబార్ జాకీర్, కృష్ణ, రంగా గౌడ్, మహేష్ గౌడ్,పులకంటి కిష్టయ్య, ఆనంద్, హైమది, పోశెట్టి, సంజీవయ్య, సాయ గౌడ్, మున్వర్, గౌస్,తదితరులు పాల్గొన్నారు