
అయిజ, వెలుగు: మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామంలో జరుగుతున్న సత్యమాంబ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలను పీఏసీఎస్ మాజీ చైర్మన్ సంకాపూర్ రాముడు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు 23 మంది మహిళా పహిల్వాన్లు, 32 మంది పురుష పహిల్వాన్లతో కలిపి 54 మంది పాల్గొన్నారు. ఈ పోటీలను చూసేందుకు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి క్రీడాభిమానులు తరలివచ్చారు.