
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ మంగళంపేట భవానీ ఆలయ జాతరలో భాగంగా గురువారం కుస్తీ పోటీలు నిర్వహించారు. పలువురు పహిల్వాన్లు పాల్గొనగా గెలిచిన వారికి ఆలయ నిర్వాహకులు వెండి కడియాలు బహుకరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జాతర మహోత్సవాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. అమ్మవారి కరుణతో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.