
కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలో మహాదేవుడి జెండా జాతర ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేసి కుస్తీ పోటీలను ప్రారంభించారు.
జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి మల్లయోధులు అధిక సంఖ్యలో హాజరై పోటీల్లో పాల్గొన్నారు. నాందేడ్ జిల్లా బిత్నాల్కు చెందిన రాజేశ్ విజేతగా నిలవగా రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు.