బంగ్లాదేశ్ వాళ్లు బాగా రెచ్చిపోతున్నారే : భారత్ టీవీ ఛానెల్స్ బ్యాన్ చేయాలంటూ పిటీషన్లు

బంగ్లాదేశ్ వాళ్లు బాగా రెచ్చిపోతున్నారే : భారత్ టీవీ ఛానెల్స్ బ్యాన్ చేయాలంటూ పిటీషన్లు

బంగ్లాదేశ్ దేశం బాగా ఎక్కువ చేస్తుందా.. ఇప్పటికే ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువులను అరెస్ట్ చేసిన ఆ దేశం.. ఇప్పుడు మరో అడుగు వేసింది. బంగ్లాదేశ్ దేశంలో వచ్చే అన్ని భారతీయ టీవీ ఛానెల్స్.. న్యూస్, ఎంటర్ టైన్ మెంట్, ఓటీటీలను బ్యాన్ చేయాలంటూ.. అక్కడి హైకోర్టులో పిటీషన్లు వేస్తున్నారు. భారత్ అంటే ఎందుకు తెగ మండిపోతున్న బంగ్లాదేశ్.. మన దేశానికి వ్యతిరేకంగా చాలా చర్యలు చేపడుతుంది. 

బంగ్లాదేశ్ దేశానికి, ఇక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని.. దేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా భారత్ టీవీ ఛానెల్స్ వ్యవహరిస్తున్నాయంటూ ఉద్దీన్ భుయాన్ అనే సీనియర్ లాయర్.. ఢాకా హైకోర్టులో పిటీషన్ వేశారు.ఈ పిటీషన్ ను జస్టిస్ నజీబ్, జస్టిస్ మహముదుర్ లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. 
బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా అన్ని టీవీ ఛానెల్స్ కథనాలు, వార్తలు ప్రసారం చేస్తున్నాయని.. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ ఆపరేషన్ యాక్ట్ 2006.. సెక్షన్ 29 ప్రకారం ఎందుకు నిషేధం విధించకూడదో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారాయన.

2024, ఆగస్ట్ నెలలో ప్రధానమంత్రి షేక్ హసీనాను తొలగించిన తర్వాత.. బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. అప్పటి నుంచి భారత్.. బంగ్లాదేశ్ మధ్య ఉన్న సత్సబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ లో హిందూవులపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలోనే భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూవులపై దాడులు ఆపాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది భారత్ సర్కార్. 

దీంతో మరింత రెచ్చిపోయిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ సభ్యులు, హిందూ పూజారి అయిన చిన్మయ కృష్ణదాస్ ను ఢాకాలో అరెస్ట్ చేసి.. కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా జైలుకు పంపించింది అక్కడి ప్రభుత్వం. ఈ అంశంపై భారత్ సీరియస్ అయిన క్రమంలోనే.. భారత్ టీవీ ఛానెల్స్ అన్నింటినీ రద్దు చేయాలంటూ అక్కడి హైకోర్టులో పిటీషన్ దాఖలు కావటంతో.. రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది.