వడ్లు మిల్లులకు తరలించాలి

వడ్లు మిల్లులకు తరలించాలి

కామారెడ్డి​, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన వడ్లు మిల్లులకు తరలించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు సెంటర్ ను పరిశీలించి, కలెక్టర్​ మాట్లాడారు. ఆకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులకు టార్పాలిన్లు ఇవ్వాలన్నారు. 

పైపులైన్ పనులు స్పీడప్ చేయాలి

మిషన్​ భగీరథ పైపులైన్ వర్క్స్ స్పీడప్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో మిషన్​ భగీరథ, మున్సిపల్ అధికారులతో రివ్యూ మీటింగ్​లో మాట్లాడారు. నిజామాబాద్​ జిల్లా ఆర్గుల్ నుంచి కామారెడ్డికి నీటి ని సప్లయ్​ చేసే  మెయిన్​ పైపులైన్ 14 కి.మీ  పనులు పూర్తి చేయాలన్నారు.  కామారెడ్డి టౌన్​లో  సప్లయ్​ చేస్తున్న నీటి వివరాలను ప్రతి రోజు అందించాలన్నారు.  పట్టణంలో ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 

రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి ..

మద్దెల చెరువు నుంచి పిట్లం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను స్పీడప్ చేయాలని ఆర్​అండ్​బీ అధికారులకు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ఆదేశించారు.  ఆర్​అండ్​బీ, ఫారెస్టు అధికారులతో  రోడ్డు పనులపై కలెక్టర్​ రివ్యూ చేశారు.  ఫారెస్టు ఏరియాలో చెట్ల నరికివేతకు సంబంధిత శాఖ పర్మిషన్​ తీసుకోవాలన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి..

పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులకు తెలిపారు.  ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా శుక్రవారం బిచ్​కుంద మండల కేంద్రంలోని జయశ్రీ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు.   కూలీ పని చేసుకుంటూ జీవించే తమ కుటుంబం రేకుల షేడ్డులో నివసిస్తుందని జయశ్రీ కలెక్టర్​తో పేర్కొన్నారు. తమకు ఇల్లు మంజూరు​ చేస్తే  నిర్మించుకుంటామని తెలిపారు. 

ఆయా కార్యక్రమాల్లో  సివిల్​ సప్లయ్​ డీఎం రాజేందర్,  అడిషనల్ కలెక్టర్​ చందర్​ నాయక్​,  మిషన్​ భగీరథ ఎస్​ఈ రాజేంద్రకుమార్,  ఈఈ నరేష్, డీఎస్​వో మల్లికార్జునబాబు,  డీసీవో రాంమోహన్,  ఆర్డీవో వీణ, ఆర్​అండ్​బీ ఈఈ  రవిశంకర్, ఎఫ్​డీవో రామకృష్ణ,  మున్సిపల్​ కమిషనర్​ రాజేందర్​రెడ్డి, ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.