కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామంటే అందరిలోనూ కొత్త ఉత్సాహం వస్తుంది. చాలామంది ఈ ఏడాది చేయలేకపోయిన కొన్ని పనులను వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి అనుకుంటుంటారు. మరికొందరు కొత్తగా ఏదైనా చేయాలని లేదా సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకుంటారు. అందులో కొంతమంది మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు. మిగతావాళ్లు ఎప్పటిలానే కొంతకాలానికి లక్ష్యాన్ని మర్చిపోతారు. అయితే గమ్యం చేరిన వాళ్లను చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. అలాగే మనం ఎందుకు ఇలా మిగిలిపోయాం అనే ఆలోచన వస్తుంది.
ఆ దిగులుతో ఏ పని మీదా దృష్టిసారించలేకపోతారు. కానీ, ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ముందు మన అలవాట్లు మార్చుకోవాలి. దాంతో టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టంగా అనిపించదు అంటాడు ఈ రచయిత. ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించింది కూడా వాటి గురించే. చెడు అలవాట్లను వదిలి, మంచిని అలవాటు చేసుకోవడానికి ప్రాక్టికల్‌గా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయని కళ్లకు కట్టినట్టు చెప్పాడు. అతి చిన్న మార్పులు గొప్ప ఫలితాలు, గెలుపు తీరాలకూ చేరుస్తాయని అర్థమయ్యే రీతిలో వివరించాడు.
న్యూరోసైన్స్ మనస్తత్వ శాస్త్రాల ఆధారంగా చేయలేమనుకున్న పనులను కూడా చేసి చూపించొచ్చు అంటాడు రచయిత. ఈ పుస్తకంలో గెలుపు సూత్రాలను ప్రస్తావించాడు. రోజుకి ఒక్క శాతం డెవలప్మెంట్ ఉంటే ఏడాదికి 37 శాతం మెరుగవుతుందంటాడు. అదే మన అలవాట్లలో మార్పుకు చిహ్నం. లక్ష్యానికి చేరువ చేసే తొలి అడుగు అనేది రచయిత ఉద్దేశం.
ఆ అంశాలను అర్థమయ్యేలా చెప్పడానికి స్పోర్ట్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైకాలజీ, న్యూరో సైన్స్ నుంచి ఉదాహరణలు తీసుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఇన్స్పైర్ చేసే విషయాలు ఇందులో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఏదైనా సాధించాలి అనుకునేవాళ్లకు ఈ పుస్తకం కచ్చితంగా ఉపయోగపడతోంది.
పుస్తకం పేరు : అటామిక్ హ్యాబిట్స్
మూల రచయిత : జేమ్స్ క్లియర్
అనువాదం : ఆకెళ్ల శివ ప్రసాద్
పేజీలు : 248,
ధర : 260/–
ప్రతులకు : ఆన్లైన్లో అందుబాటులో ఉంది.