పుస్తక రచనకు వీ6 ఎంతో ఉపయోగపడింది : డాక్టర్ సంధ్య విప్లవ్

పుస్తక రచనకు వీ6 ఎంతో ఉపయోగపడింది : డాక్టర్ సంధ్య విప్లవ్

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు ‘వీ6’ న్యూస్ చానెల్ ఎంతో దోహదపడిందని రచయిత డాక్టర్ సంధ్య విప్లవ్ అన్నారు. ఆ చానల్​లో వచ్చిన కథనాల సహాయంతో తాను పుస్తకాలు రాసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్​లో ఈ నెల 27న తాను రచించిన అరుణిమ, త్రికాల నవలల రిలీజ్, పరిచయ సభను నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

హైదరాబాద్ బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ బ్రోచర్​ను డాక్టర్ హరికాంత్​తో కలసి రిలీజ్​ చేశారు. తర్వాత ఆమె మాట్లాడుతూ.. జోగిని వ్యవస్థపై తాను రచించిన త్రికాల నవలకు ప్రోత్సహక నవలా పురస్కారం వచ్చిందన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో తాము పాల్గొన్న నేపథ్యంలో రచనలకు బీజం పడింది తెలిపారు. రచయిత్రి, హస్మిత పబ్లికేషన్స్ భండారు విజయ సభాధ్యక్షతన ‘అరుణిమ’ నవలను బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు ఆవిష్కరిస్తారని తెలిపారు.