'మనతత్వం' పుస్తకం కేసులో కోర్టుకు హాజరైన రచయిత కంచె ఐలయ్య

'మనతత్వం' పుస్తకం కేసులో కోర్టుకు హాజరైన రచయిత కంచె ఐలయ్య

కరీంనగర్ కోర్టుకు ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య హాజరయ్యారు. న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఆయన రాసిన "మనతత్వం" పుస్తకంలో  న్యాయవ్యవస్థను కించపరిచాడంటూ బీజేపీ నేత, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోర్టు రిఫరల్ తో 2017లో కరీంనగర్ వన్ టౌన్ లో  కంచె ఐలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐలయ్యకు ఇదివరకే కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన ఇవాళ కరీంనగర్ ఎడిషనల్ సెషన్ కోర్టులో హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఐదేళ్ల తర్వాత ఇయ్యాళ ఐలయ్య కోర్టుకు వెళ్లారు.

ఇదివరకు ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ఆయన రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంపైనా అప్పట్లో ఆర్యవైశ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకొని కంచె ఐలయ్య దిష్టిబొమ్మలు దగ్ధం చేసి, నిరసన వ్యక్తంచేశారు. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసి, వారి గౌరవమర్యాదలు మసకబారేలా వ్యవహరించిన కంచె ఐలయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకుని ఆ పుస్తకాన్ని నిషేధించాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ డిమాండ్ చేసింది. ఆ సమయంలోనే తనకు ఆర్యవైశ్యుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకి ప్రాణహాని వుందని కంచె ఐలయ్య ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులని ఆశ్రయించారు. ఈ వివాదంపై స్పందించిన కంచె ఐలయ్య ఆ పుస్తకం 2005లో రాసిన పుస్తకానికి అనువాదమని, ఈమధ్య కాలంలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని స్పష్టం చేశారు.