బాబీ సింహా, వేదిక, అనసూయ, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటీనటులుగా యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. మార్చి 15న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌కు గెస్ట్‌గా హాజరైన రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘రజాకార్ల మీద పోరాటం గురించి వింటేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
అలాంటి కాన్సెప్ట్‌తో సినిమా తీయడం అభినందనీయం’ అని చెప్పారు. ‘భావితరాల భవిష్యత్తు కోసం తీసిన సినిమా ఇది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’ అని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ విజయంలో భాగమవడం హ్యాపీ అని నటీనటులు అన్నారు.