అక్షయ్, ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు, జంటగా దినేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘డియర్ కృష్ణ’. ఐశ్వర్య మరో హీరోయిన్. పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు.
అనంతరం విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి షాట్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ విష్ చేశారు. జనవరి 24న సినిమా విడుదల కానుంది.
మొదటి 100 టికెట్ల బుకింగ్‌లో ఒకరికి రూ.10,000 క్యాష్ బ్యాక్ ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. వారం రోజుల పాటు ఇది కొనసాగుతుందన్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ఇన్సిడెంట్ స్ఫూర్తితో దీన్ని తెరకెక్కించామని ఈ సందర్భంగా తెలిపారు.