ఫార్మసీలో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) రాయడం తప్పనిసరి. ఇందులో మంచి ర్యాంకు పొందినవారు దేశంలోని ప్రముఖ ఫార్మసీ కాలేజీల్లో తమకు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఫార్మసీ పీజీ (ఎంఫార్మసీ), పీహెచ్‌డీ చదువుకోవచ్చు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) నిర్వహించే జీప్యాట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత: ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలు బహుళైచ్ఛిక (మల్టిపుల్ చాయిస్) తరహాలో అడుగుతారు. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ప్రశ్నపత్రం 500 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
ఆయా విభాగాలవారీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ- 38, ఫార్మాస్యూటిక్స్- 38, ఫార్మకాగ్నసీ- 10, ఫార్మకాలజీ- 28, ఇతర సబ్జెక్టులు- 11 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 8 వరకు అప్లై చేసుకోవాలి. జూన్ 8న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.natboard.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.