జగద్గిరిగుట్టలో దారుణం.. యువకుడి హత్య

జగద్గిరిగుట్టలో దారుణం.. యువకుడి హత్య

జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది.  మద్యం మత్తులో  స్నేహితులు గొడవ పడ్డారు.  మాట మాట పెరగడంతో నదీమ్​ అనే యువకుడిని హత్య చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వివరాల్లోకి వెళ్లే..

మందుకొట్టి చుక్కేస్తే అంతా మైకమే.. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో.. ఏం మాట్లాడుతున్నామో ఎవరికి తెలియదు.. పక్కోళ్ల సంగతి ఎలా ఉన్నా.. కనీసం వారికి కూడా అర్దం కాదు.  ఇప్పుడు జగద్గిరి గుట్టలో  మద్యం తాగుతున్న  స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగింది.  ఇది కాస్త తీవ్రంగా మారడంతో హత్యకు దారితీసింది.  అర్దరాత్రి మద్యం తాగుతున్న స్నేహితులు కొట్టుకొని.. నదీమ్​ అనే యువకుడిని హత్య చేశారు. ఇదిలా ఉంటే.. జగద్గిరి పోలీస్​ స్టేషన్​ పరిధిలో గత మూడు నెలల్లో మూడు హత్యలు జరిగితాయి. ఈ ప్రాంతంలో తిరిగే ఆకతాయి... మద్యం సేవించే వారు రోజూ ఏదో ఒక రగడ సృష్టిస్తూనే ఉన్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు గట్టి నిఘా నిర్వహించి .. నేరాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.