
రియాద్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ కొకో గాఫ్ సెమీఫైనల్ చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో గాఫ్ 6–3, 6–4తో ఇగా స్వైటెక్ (పోలాండ్)ను వరుస సెట్లలో ఓడించి నాకౌట్ బెర్తు ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో స్వైటెక్ తన రెండో ర్యాంక్‌ను మెరుగు పరుచుకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో బెలారస్ స్టార్ అరీనా సబలెంకా తొలిసారి ఓ ఏడాదిని నంబర్ వన్ ర్యాంక్‌తో ముగించనుంది.