దుబాయ్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మరోవైపు గాలె టెస్టులో న్యూజిలాండ్‌ను ఓడించిన శ్రీలంక మూడో స్థానానికి చేరుకొని డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. చెన్నై టెస్టులో విక్టరీ తర్వాత డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా తన పర్సెంటేజ్ పాయింట్లను (పీటీసీ) 71.67 శాతానికి పెంచుకుంది.
రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (62.50 ) కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. శ్రీలంక (50.00) మూడో స్థానానికి చేరగా, న్యూజిలాండ్ (42.86) నాలుగో ప్లేస్‌కు పడిపోయింది. పాకిస్తాన్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత నాలుగో స్థానానికి చేరుకున్న బంగ్లాదేశ్ (39.29 శాతం) ఆరో ప్లేస్‌కు పడిపోయింది. ఇంగ్లండ్ (42.19) ఐదో స్థానంలో నిలిచింది.