ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (WTC ) ఫైనల్స్ కు చేరిన టీమిండియా జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌లో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్ వేదికపై కొన్ని రోజులుగా గందరగోళం ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటమే దీనికి కారణం.
ఇంగ్లండ్ లో ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని భావించారు. అయితే.. ఇంగ్లండ్‌లోనూ కొన్ని రోజుల క్రితం వరకు కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ముందుగా నిర్ణయించిన స్టేడియం వేదికగానే మ్యాచు జరుగుతుందా.. లేదా.. అన్న ప్రశ్నలు వచ్చాయి.
దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. చివరకు ఇంగ్లండ్ వేదికగానే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచు జరుగుతుందని, పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తామని ఇవాళ(గురువారం,మే-20) నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక టెస్టుకు 4 వేల మందిని అనుమతిస్తామని, బ్రిటన్‌లో కరోనా తర్వాత పరిస్థితులు మెరుగు పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.