మ్యాట్‌పైనే ప్రాణాలు విడిచిన వుషు ప్లేయర్.. ఎందుకీ మరణాలు..?

మ్యాట్‌పైనే ప్రాణాలు విడిచిన వుషు ప్లేయర్.. ఎందుకీ మరణాలు..?

దేశంలో గుండెపోటు మరణాలు అధికమవుతున్నాయి. అప్పటివరకూ చలాకీగా తిరుగుతున్న వారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి పరిష్కారం ఏంటో తెలియట్లేదు. ఒకప్పుడు గుండెపోటు అంటే.. వయసు పైబడిన వారిలో, అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో మాత్రమే కనిపించేది. ఇప్పుడలా లేదు. ఆరేడేళ్ల వయస్సున్న పిల్లలు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి షాకింగ్ ఘటన మరొకటి వెలుగు చూసింది. 

చండీగఢ్ వేదికగా జరుగుతోన్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ వుషు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ప్లేయర్ ఒకరు గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. జైపూర్‌ జిల్లా ఛాంపియన్ మోహిత్ శర్మ(21) మ్యాచ్ మధ్యలోనే గుండెపోటుకు గురయ్యాడు. ప్రత్యర్థి.. అతన్ని బౌట్ జోన్ నుండి బయటకు విసిరిన తర్వాత మోహిత్ తిరిగి మ్యాట్‌కు చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఎలాగోలా మ్యాట్‌పైకి చేరుకున్నప్పటికీ, పైకి లేవలేకపోయాడు. రిఫరీ ఆటగాడిని పైకి లేపడానికి ప్రయత్నించగా.. అతడు గుండెపోటుకు గురైనట్లు గుర్తించారు. అతనికి తక్షణ వైద్య సహాయం అందించినప్పటికీ, బ్రతికించలేకపోయారు.

ALSO READ : హనీమూన్ కోసం గోవా వెళ్లిన కొత్త జంట: ఆ రాత్రి భర్త చేసిన పనికి భార్య షాక్

సీపీఆర్(CPR) అందించిన అనంతరం అతన్ని  హుటాహుటీన చండీగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఈ విషాద ఘటన క్రీడా సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించిన అథ్లెట్‌కు ప్లేయర్లు, సిబ్బంది అందరూ నివాళులు అర్పించారు.

ఇప్పటికే మొదటి రౌండ్ గెలిచిన మోహిత్.. రెండవ రౌండ్‌లో ముందంజలో ఉన్నారని నిర్వాహకుడు తెలిపారు.